చార్మినార్‌కు కాషాయరంగు...మార్ఫింగ్ ఫొటోపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-07T12:36:29+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయజనతాపార్టీకి 48 వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో పురాతన చారిత్రక చార్మినార్ ఫొటోకు కాషాయరంగు పులిమి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది....

చార్మినార్‌కు కాషాయరంగు...మార్ఫింగ్ ఫొటోపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయజనతాపార్టీకి 48 వార్డులు కైవసం చేసుకున్న నేపథ్యంలో పురాతన చారిత్రక చార్మినార్ ఫొటోకు కాషాయరంగు పులిమి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఎన్నికల్లో కమల వికాసం అనంతరం సుమిత్ వి అనే వ్యక్తి ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాషాయరంగులో ఉన్న చార్మినార్ ఫొటో వైరల్ కావడంతో దీనిపై హైదరాబాద్ కు చెందిన సయ్యద్ షాదాబ్ అలీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో అలీ పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విషయాన్ని పరిశీలించాలని నగర సైబర్ క్రైం బ్రాంచ్ శాఖను కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 వార్డులు, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. 

Updated Date - 2020-12-07T12:36:29+05:30 IST