స్నేహితులతో కలిసి.. మానసిక వికలాంగురాలైన చెల్లిని బలాత్కరించి..

ABN , First Publish Date - 2020-05-24T23:28:35+05:30 IST

మానసిక వికలాంగురాలైన సొంత చెల్లినే బలాత్కరించాడో కామాంధుడు.

స్నేహితులతో కలిసి.. మానసిక వికలాంగురాలైన చెల్లిని బలాత్కరించి..

జైపూర్: మానసిక వికలాంగురాలైన సొంత చెల్లినే బలాత్కరించాడో కామాంధుడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన ఓ యువతి మానసిక వికలాంగురాలు. దీన్ని అదనుగా తీసుకున్న ఆమె అన్న.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ వారంతా కలిసి ఆమెను దారుణంగా రేప్ చేశారు. ఆ తర్వాత గొంతు పిసికి ఆమెను చంపేశారు. ఆపై మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ ఘోరం మే 17న జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులంతా 19-21 ఏళ్ల వయసులోని వారేనని, వారందరినీ అదుపులోకి తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-24T23:28:35+05:30 IST