అశ్లీల వీడియోను లీక్ చేసిన బాయ్‌ఫ్రెండ్...
ABN , First Publish Date - 2020-03-11T13:48:53+05:30 IST
తనతో బాయ్‌ఫ్రెండ్ సన్నిహితంగా గడిపిన అశ్లీల వీడియోను తన స్నేహితులకు లీక్ చేశాడనే ఆవేదనతో ఓ ప్రియురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ...
ప్రియురాలి ఆత్మహత్య
అహ్మదాబాద్ (గుజరాత్): తనతో బాయ్‌ఫ్రెండ్ సన్నిహితంగా గడిపిన అశ్లీల వీడియోను తన స్నేహితులకు లీక్ చేశాడనే ఆవేదనతో ఓ ప్రియురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఛాహరానగర్ ప్రాంతంలో జరిగింది. ఛాహరానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు. ప్రేయసీప్రియులిద్దరూ పరస్పర అంగీకారంతోనే కలిశారు. శారీరకంగా కలిసిన దృశ్యాలను ఇద్దరి ఆమోదంతోనే వీడియో తీసుకున్నారు. అనంతరం బాయ్‌ఫ్రెండ్ తనతో గడిపిన అశ్లీల వీడియోను తన ముగ్గురు స్నేహితులకు లీక్ చేశాడు. అంతే విషయం తెలిసిన ప్రియురాలు ఆవేదన చెంది డిప్రెషన్లోకి వెళ్లింది. తన బాయ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పోయిన 16 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేర తాము ఐపీసీ సెక్షన్లు, పోస్కో, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశామని సర్దార్ నగర్ పోలీసు ఇన్స్పెక్టరు హేమంత్ పటేల్ చెప్పారు.