ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో టెంపో డ్రైవరు అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-03T14:39:38+05:30 IST

లిఫ్టు ఇస్తానంటూ ఇద్దరు మైనర్ బాలికలను టెంపోలో ఎక్కించుకున్న ఓ డ్రైవరు వారిపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన...

ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో టెంపో డ్రైవరు అరెస్ట్

గువహటి (అసోం): లిఫ్టు ఇస్తానంటూ ఇద్దరు మైనర్ బాలికలను టెంపోలో ఎక్కించుకున్న ఓ డ్రైవరు వారిపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన అసోంలో జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ నహర్ లాగూన్ పట్టణంలో గృహ కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు బాలికలు గురువారం ఉదయం ఇంటి నుంచి పారిపోయి లఖింపూర్ లోని బందర్ దేవా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ టెంపో డ్రైవరు లిఫ్టు ఇస్తానంటూ ఎక్కించుకొని రోజంతా తిప్పి పెద్ద బాలికపై అత్యాచారం చేశాడు. మరో బాలికపై అత్యాచారం చేస్తుండగా నిందితుడిని గ్రామస్థులు పట్టుకున్నారు. 


పోలీసులు బాలికలకు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి పిల్లల సంరక్షణాలయానికి పంపించారు. భారతీయ శిక్షాస్మృతి కింద టెంపో డ్రైవరుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని లఖీంపూర్ జిల్లా ఎస్పీ లాంగ్నిట్ టెరోంగ్ చెప్పారు.

Updated Date - 2020-10-03T14:39:38+05:30 IST