శ్రావణి కేసులో వెలుగులోకి వచ్చిన అశోక్‌రెడ్డి దారుణాలు

ABN , First Publish Date - 2020-09-18T02:00:43+05:30 IST

సీరియల్ నటి శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణిని అశోక్‌రెడ్డి విపరీతంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం.

శ్రావణి కేసులో వెలుగులోకి వచ్చిన అశోక్‌రెడ్డి దారుణాలు

హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణిని అశోక్‌రెడ్డి విపరీతంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. 2017 నుంచి శ్రావణితో అశోక్‌రెడ్డికి పరిచయం ఉంది. అశోక్‌రెడ్డి తీసిన ఆర్‌ఎక్స్‌ 100లో శ్రావణి గెస్ట్‌ రోల్‌లో నటించింది. శ్రావణిని అన్ని విధాలుగా అశోక్‌రెడ్డి వాడుకున్నట్లు సమాచారం. శ్రావణి ఆర్థిక పరిస్థితిని అడ్డంపెట్టుకొని అశోక్‌రెడ్డి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రావణికి పలుమార్లు అశోక్‌ రెడ్డి ఆర్థికసాయం చేశాడు. ఆర్థికసాయం నెపంతో శ్రావణిపై అశోక్‌రెడ్డి జులుం ప్రదర్శించినట్లు చెబుతున్నారు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని అశోక్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలినట్లు చెబుతున్నారు. 


శ్రావణి చనిపోయినరోజు కూడా అశోక్‌రెడ్డి శ్రావణి ఇంటికొచ్చాడు. శ్రావణి కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. అదే సమయంలో శ్రావణి ఇంటికి కూడా సాయి వచ్చాడు. సాయి, అశోక్‌రెడ్డి శ్రావణిని టార్చర్ చేసినట్లు చెబుతున్నారు. ఇద్దరి వేధింపులను ఆమె దేవరాజ్‌తో షేర్‌ చేసుకుంది. సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్‌ కండీషన్ పెట్టాడు. దీంతో కొన్నాళ్ల నుంచి శ్రావణిని దేవరాజ్‌రెడ్డి దూరంపెట్టాడు. ముగ్గురు వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-09-18T02:00:43+05:30 IST