యూపీలో మరో దారుణం

ABN , First Publish Date - 2020-10-21T14:34:30+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది....

యూపీలో మరో దారుణం

బాలిక కోచింగుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా...

అమేథి (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.అమెథీ జిల్లాలోని ముసాఫర్జానా కొత్వాలీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక కోచింగుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా బాలిక మామయ్యతోపాటు అతని స్నేహితుడు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అఘాయిత్యానికి గురైన బాలిక చిరిగిన బట్టలతో ఇంటికి వచ్చి జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటన ఈ నెల 16వతేదీన జరిగినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మూడురోజుల తర్వాత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


నిందితులు బాలికపై అఘాయిత్యం చేసి పారిపోయారు. ముసాఫిర్ ఖానా కొత్వాలీ పోలీసులు నిందితులను పోలీసుస్టేషనుకు పిలిపించి వారిని కుర్చీలపై హాయిగా కూర్చోబెట్టారు. ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో నిందితులను ఇలా అతిథుల్లా పోలీసులు కుర్చీల్లో కూర్చొబెడతారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో స్పందించిన అమేథి జిల్లా ఎస్పీ దినేష్ సింగ్ నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు.నిందితుడైన బాలిక మామయ్యతోపాటు అతని స్నేహితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దినేష్ చెప్పారు.

Updated Date - 2020-10-21T14:34:30+05:30 IST