ఆన్‌లైన్‌ క్లాసులతో బయటపడ్డ తండ్రి రాసలీలలు..!

ABN , First Publish Date - 2020-12-07T18:18:39+05:30 IST

ఆన్‌లైన్ క్లాసుల మూలంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఓ తండ్రి రాసలీలల దృశ్యాలు కుమార్తె కంటపడ్డాయి. ఆ వీడియోలను తల్లికి చూపించడంతో...

ఆన్‌లైన్‌ క్లాసులతో బయటపడ్డ తండ్రి రాసలీలలు..!

బెంగళూరు: ఆన్‌లైన్ క్లాసుల మూలంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఓ తండ్రి రాసలీలల దృశ్యాలు కుమార్తె కంటపడ్డాయి. ఆ వీడియోలను తల్లికి చూపించడంతో ఆ తండ్రి గుట్టురట్టయింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగల తాలూకాలో జరిగింది. కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ క్లాసుల కోసం కుమార్తెకు అతడి స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చాడు. కాసేపు.. క్లాసుల్లో నిమగ్నం అయిన కుమార్తె.. క్లాసులు అయిపోయాక తండ్రి స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఫోల్డర్స్‌ను చూడగా వీడియోలు కనిపించాయి. ఆ వీడియోల్లో ఆమె తండ్రి మరో మహిళతో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే.. సదరు వీడియోలను తల్లికి చూపింది. షాక్‌కు గురైన తల్లి తాను అన్యాయానికి గురయ్యానని, న్యాయం చేయాలంటూ మహిళా సాంత్వన కేంద్రాన్ని ఆశ్రయించింది. నాగమంగల పోలీస్ స్టేషన్‌లో కూడా భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-07T18:18:39+05:30 IST