నా భర్త ద్వారా హెర్పిస్ వ్యాధి సోకింది

ABN , First Publish Date - 2020-12-17T13:51:52+05:30 IST

చెడు తిరుగుళ్లు తిరిగే భర్త నుంచి తనకు లైంగిక సంక్రమణ వ్యాధి అయిన హెర్పిస్ సోకిందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన....

నా భర్త ద్వారా హెర్పిస్ వ్యాధి సోకింది

పోలీసులకు వివాహిత ఫిర్యాదు

అహ్మదాబాద్(గుజరాత్): చెడు తిరుగుళ్లు తిరిగే భర్త నుంచి తనకు లైంగిక సంక్రమణ వ్యాధి అయిన హెర్పిస్ సోకిందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. అహ్మదాబాద్ నగరంలోని వెజల్ పూర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వివాహిత లాక్ డౌన్ సమయంలో తన భర్త నుంచి హెర్పిస్ వ్యాధి సోకిందని ఆరోపించారు. 2017 మేలో మేనెక్ బాగ్ నివాసిని తాను వివాహమాడానని, అతను తాగుబోతు అని, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త శరీరంపై పుండ్లు ఉన్నాయని, ఆయన నుంచి తనకు లైంగిక సంక్రమణ వ్యాధి అయిన హెర్పిస్ సోకిందని మహిళ ఆరోపించింది. దీనిపై ప్రశ్నిస్తే భర్త తనను కొట్టి పుట్టింట్లో వదిలేశారని వివాహిత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-17T13:51:52+05:30 IST