ఎర్రగుంట్ల రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

ABN , First Publish Date - 2020-12-15T23:37:31+05:30 IST

శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సువర్ణమ్మ

ఎర్రగుంట్ల రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

కర్నూలు: శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సువర్ణమ్మ (63) మృతి చెందింది. సిరివెళ్ల మండలం యర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మృతులను సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10) గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథరెడ్డి  పరామర్శించారు.

Updated Date - 2020-12-15T23:37:31+05:30 IST