టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌... ఆటో పై బోల్తా

ABN , First Publish Date - 2020-12-11T07:12:43+05:30 IST

టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌ అవడంతో అదుపుతప్పి ఆటోపై బోల్తా పడింది.

టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌... ఆటో పై బోల్తా

 పలువురికి గాయాలు, తప్పిన పెనుప్రమాదం 

అబ్దుల్లాపూర్‌మెట్‌, డిసెంబర్‌ 10(ఆంధ్రజ్యోతి): టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌ అవడంతో అదుపుతప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురు ప్రయాణికులు గాయాల పాలైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా దేశ్‌ముఖ్‌ గ్రామం నుంచి స్టోన్‌ డస్ట్‌ లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ బాటసింగారం విజయవాడ జాతీయ రహదారి వద్దకు చేరుకోగానే బ్రేక్‌డౌన్‌ అయింది. అదే సమయంలో టిప్పర్‌ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి మరో ఆటోపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిపారు. టిప్పర్‌ జాతీయ రహదారి మీదకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-12-11T07:12:43+05:30 IST