ఏకే-47 తూటాలతో బెళగావిలో పట్టుబడ్డ సైనికుడు

ABN , First Publish Date - 2020-09-13T21:38:09+05:30 IST

స్థానిక సాంబ్రా విమానాశ్రయంలో ఓ సైనికుడు ఏకే-47 తూటాలతో పట్టుబడ్డాడు. ఆ సైనికుడిని పోలీసులు

ఏకే-47 తూటాలతో బెళగావిలో పట్టుబడ్డ సైనికుడు

బెళగావి : స్థానిక సాంబ్రా విమానాశ్రయంలో ఓ సైనికుడు ఏకే-47 తూటాలతో పట్టుబడ్డాడు. ఆ సైనికుడిని పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ సెంటర్‌కు అప్పగించారు. 


సాంబ్రా విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ సైనికుడు బెంగళూరు నుంచి అలియెన్స్ విమానంలో శనివారం రాత్రి బెళగావి వచ్చారు. ఆయన వద్ద ఏకే-47 తూటాలు ఉన్నట్లు స్క్రీనింగ్‌లో గుర్తించారు. ఏకే-47 లైవ్ రౌండ్ ఒకటి, ఇన్సాస్ ఫైర్డ్ ఎంపీ కేస్ ఒకటి ఉన్నట్లు గుర్తించారు. 


విమానాశ్రయం భద్రతాధికారులు ఆ సైనికుడిని మరిహాల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు ఆ సైనికుడిని దర్యాప్తు చేసి, అనంతరం మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ సెంటర్‌కు అప్పగించారు. బెళగావిలోని ఈ సెంటర్ తదుపరి దర్యాప్తు నిర్వహిస్తుంది. 


Updated Date - 2020-09-13T21:38:09+05:30 IST