దంపతుల ఆత్మహత్య.. మృతదేహాల పక్కనే రోదిస్తున్న పసికందు!

ABN , First Publish Date - 2020-06-26T23:52:45+05:30 IST

తొమ్మిది నెలల పసిబిడ్డను అనాధను చేస్తూ ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

దంపతుల ఆత్మహత్య.. మృతదేహాల పక్కనే రోదిస్తున్న పసికందు!

ఘజియాబాద్: తొమ్మిది నెలల పసిబిడ్డను అనాధను చేస్తూ ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరి మృతదేహాల పక్కనే ఆ పసికందు రోదిస్తున్న దృశ్యం మనసుల్ని కలచివేసింది. ఈ  హృదయవిదారక సన్నివేశం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నిఖిల్, పల్లవి అనే జంట నివసిస్తోంది. వీళ్ళిద్దరికి రెండేళ్ల క్రితం పెళ్ళయింది. వీరు ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇదిలా వుండగా, నిఖిల్ తన సోదరికి శుక్రవారం ఓ మెసేజ్ పెట్టాడు. ఉదయం 6గంటలకు ఒకసారి తన ఇంటికి రావాలని ఆమెకు చెప్పాడు. ఆ సమయానికి వారి ఇంటికి వెళ్లిన ఆమె దిగ్భ్రాంతికి గురయింది. ఎందుకంటే, ఆమె వెళ్ళేసరికి నిఖిల్, పల్లవి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నారు. ఆ మృతదేహాల పక్కనే వారి తొమ్మిది నెలల పసిబిడ్డ రోదిస్తూ ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య కేసు నమోదు చేసుకొన్నట్లు ఇందిరాపురం పోలీస్ అధికారి అన్షు జైన్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆమె చెప్పారు.

Updated Date - 2020-06-26T23:52:45+05:30 IST