ఏడాది క్రితంనాటి నూడుల్స్ తిని 9 మంది మృతి

ABN , First Publish Date - 2020-10-22T01:29:19+05:30 IST

ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో

ఏడాది క్రితంనాటి నూడుల్స్ తిని 9 మంది మృతి

బీజింగ్: ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే.. అదే ఆహారం ప్రాణాల మీదకు వస్తుంది. ఆహారం విషంగా మారి అనేక మంది ప్రాణాలు పోయాయి. తాజాగా చైనాలోని ఓ కుటుంబం కూడా ఇదే విషానికి బలైపోయింది. ఏకంగా 9 మంది కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయాయి. ఏడాది క్రితం చేసిన నూడిల్స్‌ను తినడమే ఇందుకు కారణం.


ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది. దీంతో ఈ నూడుల్స్ తిన్న 9 మంది (అందరూ పెద్దవారే) చనిపోయారు. కాగా, ముగ్గురు చిన్నారులు నూడుల్స్ రుచి వారికి నచ్చకపోవడంతో వారు తినలేదు. నూడుల్స్ తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Updated Date - 2020-10-22T01:29:19+05:30 IST