రాబరీకి పథకం వేసిన ముఠాలో పోలీసులు.. 8మంది అరెస్ట్!

ABN , First Publish Date - 2020-08-12T04:14:30+05:30 IST

ఓ ఫైనాన్స్ ఆఫీసులో కన్నం వేయడానికి పథకం వేసిందో ముఠా.

రాబరీకి పథకం వేసిన ముఠాలో పోలీసులు.. 8మంది అరెస్ట్!

న్యూఢిల్లీ: ఓ ఫైనాన్స్ ఆఫీసులో కన్నం వేయడానికి పథకం వేసిందో ముఠా. ఈ రాబరీ చేయబోయిన వీరిని పోలీసులు అరెస్టు చేశారు. తీరాచూస్తే ఈ ముఠాలో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ ఆఫీసులో రాబరీకి ప్రయత్నించిన ఓ ముఠాను ఢిల్లీపోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ స్పెషల్ సెల్ అధికారి ఉన్నారు. వీరంతా కలిసి పోలీసుల్లా నటించి సదరు ఫైనాన్స్ ఆఫీసుపై రెయిడ్ చేశారు. అక్కడి ఉద్యోగులను తుపాకీలతో బెదిరించారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది  ప్రాణాలకు తెగించి నిందితులతో పోరాడారు. వారి చేతుల్లోని తుపాకీలు లాక్కొని పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Updated Date - 2020-08-12T04:14:30+05:30 IST