కరోనా వేళ బర్త్‌డే పార్టీ.. 11మంది డాక్టర్లపై కేసు!

ABN , First Publish Date - 2020-07-20T04:25:28+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇటువంటి సమయంలో కొంతమంది వైద్యులు బర్త్‌డే పార్టీ చేసుకున్నారు.

కరోనా వేళ బర్త్‌డే పార్టీ.. 11మంది డాక్టర్లపై కేసు!

పూణే: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇటువంటి సమయంలో కొంతమంది వైద్యులు బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు 11మంది డాక్టర్లపై కేసు నమోదుచేశారు. అలాగే ఇద్దరు రిసార్ట్ మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్రలో జరిగింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్న కారణంగా పూణేలో పదిరోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలను పక్కనబెట్టిన వైద్యులు శుక్రవారంనాడు బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ‘లాక్‌డౌన్‌లో మూసేసి ఉండాల్సిన రిసార్టు అర్థరాత్రి తెరిచారని, దానిలో కొందరు వ్యక్తులు చేరి పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-20T04:25:28+05:30 IST