డిజిటల్ చెల్లింపులు జూమ్
ABN , First Publish Date - 2020-10-19T05:48:43+05:30 IST
దేశంలో డిజిటల్ చెల్లింపులకు ఇచ్చిన ప్రాధాన్యం మంచి ఫలితాలు అందించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు గణనీయం గా తగ్గాయి.

ఫలించిన ఆర్బీఐ చర్యలు
భారీగా పడిపోయిన నగదు చెల్లింపులు
ముంబై : దేశంలో డిజిటల్ చెల్లింపులకు ఇచ్చిన ప్రాధాన్యం మంచి ఫలితాలు అందించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు గణనీయం గా తగ్గాయి. మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపుల వాటా 2.96 శాతానికి విలువపరంగా 20.08 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ గణాంకాలు తెలుపుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దుతో 2016 నుంచి ప్రజలను డిజిటల్ చెల్లింపుల దిశగా ఆకర్షించేందుకు ఆర్బీఐ గట్టి కృషి ప్రారంభించింది. అప్పటికి దేశంలో పేపర్ కరెన్సీ, చెక్కుల వినియోగం 15.81 శాతం లేదా విలువపరంగా 46.08 శాతం ఉండేది. ఆ తర్వాత ఆర్బీఐ చేపట్టిన ప్రచారోద్యమం, ప్రోత్సాహంతో క్రమం గా పేపర్ కరెన్సీ చెల్లింపులు తగ్గి డిజిటల్ చెల్లింపులు పెరుగుతూ వచ్చాయి. కరోనా కారణంగా లాక్డౌన్ల ప్రభావంతో డిజిటల్ చెల్లింపుల విలువ గత కొద్ది నెలల్లో కొన్ని రెట్లు పెరిగిపోయింది.
2016-2020 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు 55.1 శాతం వార్షిక వృద్ధితో రూ.593.61 కోట్ల నుంచి రూ.3,434.56 కోట్లకు పెరిగాయి.