ఆ సిమ్యులేటర్లను తయారు చేస్తున్నాం: జెన్ టెక్
ABN , First Publish Date - 2020-08-11T06:17:12+05:30 IST
రక్షణ శాఖ నిలిపివేసిన 101 రకాల రక్షణ, యుద్ధ పరికరాల దిగుమతుల్లో 9 సిమ్యులేటర్లు ఉన్నాయని, వాటిని తాము డిజైన్ చేసి తయారు చేస్తున్నామని జెన్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ అట్లూరి అశోక్ తెలిపారు...

రక్షణ శాఖ నిలిపివేసిన 101 రకాల రక్షణ, యుద్ధ పరికరాల దిగుమతుల్లో 9 సిమ్యులేటర్లు ఉన్నాయని, వాటిని తాము డిజైన్ చేసి తయారు చేస్తున్నామని జెన్ టెక్నాలజీస్ చైర్మన్, ఎండీ అట్లూరి అశోక్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం దేశీయ రక్షణ పరికరాల తయారీ పరిశ్రమకు ఊతం ఇవ్వగలదని, ముఖ్యంగా జెన్ టెక్నాలజీ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చగలదని తెలిపారు. జెన్ టెక్నాలజీస్.. వివిధ రకాల సిమ్యులేటర్లను డిజైన్ చేసి తయారీ చేస్తోంది. ఇప్పటి వరకూ 100కు పైగా ఖాతాదారులకు 450 సిమ్యులేటర్లను సరఫరా చేసింది. కంపెనీ ఖాతాదారుల్లో రక్షణ సేవా దళాలు, రాష్ట్రాల పోలీసులు, పారా మిలటరీ దళాలు, ఆగ్నేయ ఆసియాలోని ఒక దేశం నేవీ దళం తదితరాలు ఉన్నాయని అశోక్ తెలిపారు.
- హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్)