యెస్‌ బ్యాంకు సేవలు మళ్లీ షురూ

ABN , First Publish Date - 2020-03-19T07:14:22+05:30 IST

యెస్‌ బ్యాంకు సేవలు మళ్లీ షురూ

యెస్‌ బ్యాంకు సేవలు మళ్లీ షురూ

ముంబై: యెస్‌ బ్యాంకు మళ్లీ తెరుచుకుంది. పదమూడు రోజుల విరామం తర్వాత బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ తన బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించింది. దీంతో చాలా చోట్ల ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఈ రద్దీని తట్టుకునేందుకు గురువారం నుంచి ఈ నెల 21 వరకు తమ అన్ని శాఖలను ఉదయం 8.30 గంటలకే తెరుస్తామని ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్ల బ్యాంకింగ్‌ సేవల కోసమూ ఈ నెల 27 వరకు అన్ని శాఖల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు  పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయి. 

Updated Date - 2020-03-19T07:14:22+05:30 IST