కోటికిపైగా మేడిన్ ఇండియా పవర్ బ్యాంకులు విక్రయించిన షియోమీ

ABN , First Publish Date - 2020-11-04T03:09:54+05:30 IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేరకు షియోమీ దేశంలో ఇప్పటి వరకు కోటికిపైగా మేడిన్ ఇండియా ఎంఐ పవర్ బ్యాంకులను విక్రయించింది. ఈ మేరకు

కోటికిపైగా మేడిన్ ఇండియా పవర్ బ్యాంకులు విక్రయించిన షియోమీ

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ దేశంలో ఇప్పటి వరకు కోటికిపైగా మేడిన్ ఇండియా ఎంఐ పవర్ బ్యాంకులను విక్రయించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. షియోమీ 2017 నుంచి భారత్‌లో పవర్ బ్యాంకులను అసెంబుల్ చేస్తోంది. అప్పటి నుంచి దేశంలో తయారు చేసిన అన్ని యూనిట్లు అమ్ముడుపోయినట్టు తెలిపింది. ఈ మూడేళ్ల కాలంలో కోటికిపైగా పవర్ బ్యాంకులు విక్రయించినట్టు వివరించింది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో వివిధ రకాలైన ఐదు పవర్ బ్యాంకులు విక్రయానికి ఉన్నాయి. వీటిలో తాజాగా లాంచ్ చేసిన ఎంఐ పవర్ బ్యాంకు 3ఐ 20,000 ఎంఏహెచ్, ఎంఐ పవర్ బ్యాంకు 3ఐ 10,000 ఎంఏహెచ్, ఎంఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ 10,000 ఎంఏహెచ్, రెడ్‌మి పవర్ బ్యాంక్ 20,000 ఎంఏహెచ్, రెడ్‌మి  పవర్ బ్యాంక్ 10,000 ఎంఏహెచ్ ఉన్నాయి. 


ఈ నెల 5న మరో సరికొత్త పవర్ బ్యాంకును లాంచ్ చేయబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అత్యంత సమర్థవంతమైనదని చెబుతున్నారు. దీనిని ‘హిడెన్ పవర్‌హౌస్‌’గా కంపెనీ అభివర్ణిస్తోంది. అంతేకాదు, జేబులో అమరిపోయేంత చిన్నగానూ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇంతకుమించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు.  అయితే, అది ఎంఐ పవర్ బ్యాంక్ 3 అల్ట్రా కాంపాక్ట్  మోడల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత దీనిని యూరప్‌లో విడుదల చేయనున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిని ఇండియాలోనూ లాంచ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.  

Updated Date - 2020-11-04T03:09:54+05:30 IST