తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ ఏర్పాటు... ఓలా

ABN , First Publish Date - 2020-12-16T01:22:26+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కర్మాగారాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్టు ఓలా ప్రకటించింది. రూ. 2,400 కోట్ల వ్యయంతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా తెలిపింది.

తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ ఏర్పాటు... ఓలా


చెన్నై :
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కర్మాగారాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్టు ఓలా ప్రకటించింది. రూ.  2,400 కోట్ల వ్యయంతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా తెలిపింది. ఇది భారతదేశ భవిష్యత్తు వాహన అవసరాలను తీరుస్తుందని పేర్కొంది.

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్...  
 స్థానిక తయారీ, స్థానికులకు ఉద్యోగాలు , దేశావసరాలు తీర్చే  ప్లాంట్  గా ప్రభుత్వం దీనిని అభివర్ణిస్తోంది. ‘ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకణుగుణంగా ఓలా కర్మాగారం ఆత్మ నిర్భర్ భారత్ తయారీలో ఒక ముఖ్యమైన దశ’ అని పేర్కొంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ వంటి కీలకమైన భవిష్యత్ అవసరాలను తీరుస్తుందని, వాహన తయారీ రంగంలో భారతదేశం ఇతర దేశాల నుండి దిగుమతుల కోసం ఆధారపడటాన్ని తగ్గిస్తుందని సంస్థ పేర్కొంది.స్థానిక తయారీని పెంచుతుందని, స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తుందని, దేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందని ఓలా రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన ఒక ప్రకటన వివరించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా... ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా దేశంలో మొట్టమొదటగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిశ్రమ ప్రారంభంలో 2 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త తయారీ కర్మాగారం వచ్చే సంవత్సరంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.

Read more