యాపిల్ ప్రపంచ నెం.1
ABN , First Publish Date - 2020-08-01T08:18:48+05:30 IST
ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది.

అత్యంత విలువైన కంపెనీగా అవతరణ
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది. గత త్రైమాసికానికి అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్లో యాపిల్ షేరు ధర ఏకంగా 7 శాతంపైగా ఎగబాకి 412.37 డాలర్లకు చేరుకుంది. తద్వారా, కంపెనీ మార్కెట్ విలువ 1.762 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని తాకింది. దాంతో సౌదీ అరామ్కోను ప్రపంచ నెం.1 స్థానం నుంచి వెనక్కి నెట్టింది. అంతకుముందే, మైక్రోసా్ఫ్టను దాటి అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగానూ యాపిల్ అవతరించింది. గత ఏడాది మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి అరామ్కో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. ప్రసుతం కంపెనీ మార్కెట్ విలువ 1.759 లక్షల కోట్ల డాలర్లు. మార్కెట్లో లిస్టయ్యాక విలువైన కంపెనీల్లో సౌదీ అరామ్కో రెండో స్థానానికి జారుకోవడం ఇదే తొలిసారి.