ఆపిల్ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’ పొడిగింపు...

ABN , First Publish Date - 2020-12-11T20:12:16+05:30 IST

కరోనా నేపధ్యంలో గూగుల్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తూ వస్తున్నాయి. మొబైల్ దిగ్గజం ఆపిల్ కూడా తమ ఉద్యోగులకు ‘ఇంటి నుండి పని’ని పొడిగించింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఆపిల్ సంస్థకు చెందిన అధిక సంఖ్యలో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే అవకాశాలు లేవు.

ఆపిల్ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’ పొడిగింపు...

న్యూయార్క్ :  కరోనా నేపధ్యంలో గూగుల్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తూ వస్తున్నాయి. మొబైల్ దిగ్గజం ఆపిల్ కూడా తమ ఉద్యోగులకు ‘ఇంటి నుండి పని’ని పొడిగించింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఆపిల్ సంస్థకు చెందిన అధిక సంఖ్యలో ఉద్యోగులు  కార్యాలయాలకు వచ్చే అవకాశాలు లేవు. ఈ మేరకు కంపెనీ వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించింది. వచ్చే జూన్ నాటికి ఎక్కువ మంది ఉద్యోగులను కార్యాలయానికి రావాల్సిందిగా కోరడంలేదు. ఈ మేరకు ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్... ‘వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు’ అంశాన్ని తమ ఉద్యోగులకు వర్చువల్ సమావేశంలో తెలిపారు. ఉద్యోగులు జూన్ వరకు ఇంటి నుండి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కూడా ఆశాజనక ఫలితాలు, ఉత్పత్తి ఉంటాయని టిమ్ కుక్ పేర్కొన్నారు. 


కాగా... పరికరాల రూపకల్పన విభాగానికి వర్క్ ఫ్రమ్ హోం పెద్ద సవాల్ అని టిమ్ కుక్  పేర్కొన్నారు. రోబోలను ఇంటి నుండి నియంత్రించడం, ఐపాడ్స్ ద్వారా టెక్నీషియన్లకు మార్గనిర్దేశనం చేయడం ద్వారా లాక్ డౌన్ కాలలో కొంత మేర తయారీని కొనసాగించినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆపిల్ కార్యాలయం నుండి కేవలం 15 శాతం ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. 


Updated Date - 2020-12-11T20:12:16+05:30 IST