కుటుంబ వ్యాపారాల్లో మహిళలు 18 శాతమే

ABN , First Publish Date - 2020-11-26T08:04:20+05:30 IST

అంతర్జాతీయంగా కుటుంబ వ్యాపారాల్లో మహిళలు 18 శాతమే ఉన్నారు. యూరప్‌, మధ్య ఆసియాల్లో ఈ శాతం ఎక్కువగా ఉంది

కుటుంబ వ్యాపారాల్లో మహిళలు 18 శాతమే

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయంగా కుటుంబ వ్యాపారాల్లో మహిళలు 18 శాతమే ఉన్నారు. యూరప్‌, మధ్య ఆసియాల్లో ఈ శాతం ఎక్కువగా ఉంది. కుటుంబ వ్యాపారాల్లో మహిళలకు గుర్తింపులేని బాధ్యతలు అప్పగించడం, సలహాల పాత్రకు పరిమితం చేస్తున్నారని స్టెప్‌ ప్రాజెక్ట్‌, కేపీఎంజీ నిర్వహించిన అఽధ్యయనంలో వెల్లడైంది.అధ్యయనంలో భాగంగా భారత్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) తయారీ, సేవల రంగాల్లోని 53 కంపెనీల్లో సర్వే చేసింది. భారత్‌లో మహిళలు వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నప్పటికీ.. పని చేసే వారిలో మహిళల శాతం తగ్గుతోంది. కాగా యూఎన్‌ ఎస్‌డీజీ జెండర్‌ ఇండెక్స్‌లోని 129 దేశాల్లో భారత్‌ 95వ స్థానంలో ఉంది. 

Updated Date - 2020-11-26T08:04:20+05:30 IST