14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

ABN , First Publish Date - 2020-02-12T10:13:46+05:30 IST

14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

14 నుంచి మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు

  • నెల్లూరులో నిర్వహణ 

నెల్లూరు (వెంకటేశ్వరపురం) : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ నెల 14 నుంచి నెల్లూరులో మూడు రోజుల పాటు సదస్సును నిర్వహిస్తున్నారు. ఎంఎ్‌సఎంఈ, ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌, నెల్లూరు జిల్లా పరిశ్రమల శాఖ, మెప్మా, డీఆర్‌డీసీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. మహిళలకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించటంతో పాటు పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివరాలను సదస్సులో అందించనున్నారు. అదేవిధంగా ట్రేడ్‌ ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-02-12T10:13:46+05:30 IST