వారి సంపద ఎంత పెరిగిందంటే...

ABN , First Publish Date - 2020-11-14T02:10:34+05:30 IST

కరోనా మహమ్మారి కాలంలో కుబేరులు మరింత కుబేరులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా... రెండు వేల మందికి పైగా బిలియనీర్లు ఈ సంవత్సరం 10 ట్రిలియన్ డాలర్ల సంపదను ఆర్జించినట్లు ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీ పీడబ్ల్యుసీ, స్విస్ బ్యాంకు యూబీసీ అధ్యయనంలో తేలింది.

వారి సంపద ఎంత పెరిగిందంటే...

బెర్న్ : కరోనా మహమ్మారి కాలంలో కుబేరులు మరింత కుబేరులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా... రెండు వేల మందికి పైగా బిలియనీర్లు ఈ సంవత్సరం 10 ట్రిలియన్ డాలర్ల సంపదను ఆర్జించినట్లు ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీ పీడబ్ల్యుసీ, స్విస్ బ్యాంకు యూబీసీ అధ్యయనంలో తేలింది. లాక్ డౌన్ సమయంలోనూ భారీగా ఆర్జించిన వ్యాపారవేత్తల్లో... జెఫ్ బెజోస్(అమెజాన్ అధినేత), జుకర్ బర్గ్((ఫేస్‌బుక్), ఎలాన్ మస్క్(స్పెసెక్స్) ,కోలిన్ హాంగ్(చైనీస్ ఈ కామర్స్ కంపెనీ పిండౌడో అధినేత) , జూమ్ ఎరిక్((యువాన్)  ఉన్నారు.


జెఫ్ బెజోస్...

అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ సంపద అక్టోబర్ 2019 నాటికి 114 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది కాలంలో ఇప్పుడు ఆయన సంపద 184 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇటీవలి కాలంలో అమెజాన్ షేర్ భారీగా జంప్ కావడంతో ఆయన సంపద కూడా ఎగసింది. ఆగస్టు నెలలో బెజోస్ సంపద 200 బిలియన్ డాలర్లను దాటింది. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చింది.


మార్క్ జుకర్‌బర్గ్...

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 లో దాదాపు రెండింతలు పెరిగింది. ఏప్రిల్ నెలలో ఆయన సంపద 54.7 బిలియన్ డాలర్లు కాగా, తాజాగా 101.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో 100 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన నలుగురిలో ఒకరిగా  జుకర్‌బర్గ్ నిలిచారు.


ఎలాన్ మస్క్...

స్పెసెక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపాదన 2020 లో భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఆయన నికర ఆస్తి 23.9 బిలియన్ డాలర్లు కగా... ఈ ఏడాది కాలంలో 300 రెట్లు పెరిగింది. టెస్లా స్టాక్ పెరగడంతో ఆయన సంపద పెరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 92.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా టెస్లా నిలిచిన విషయం తెలిసిందే. 


కోలిన్ హాంగ్...

చైనీస్ ఈ-కామర్స్ కంపెనీ పిండౌడో అధినేత కోలిన్ హాంగ్ చైనాలో నాలుగో స్థానంలో నిలిచిన ధనవంతుడు. అయితే మిగతా చైనీస్ కుబేరులతో పోలిస్తే ఆయన సంపద వేగంగా పెరిగింది. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఈ-కామర్స్ కంపెనీలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన ఈ కంపెనీ స్టాక్ కరోనా కాలంలో రెండింతలు పెరిగింది. కోలిన్ హాంగ్ సంపద ప్రస్తుతం 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది.


ఎరిక్ యువాన్...

లాక్‌డౌన్ సమయంలో అత్యంత ఎక్కువగా లాభపడిన వారిలో జూమ్ కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ ఉన్నారు. కంపెనీ వినియోగం కరోనా సమయంలో ఏకంగా 1,900 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఆయన సంపద 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

Updated Date - 2020-11-14T02:10:34+05:30 IST