మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రద్దుపై 26-28 తేదీల్లో ఓటింగ్...

ABN , First Publish Date - 2020-12-11T20:58:28+05:30 IST

మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ రద్దుకు సంబంధించి... వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సమ్మతిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కోరింది. ఈ నెల 26-28 తేదీల మధ్య ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని, ఈ పథకాల రద్దు నిర్ణయానికి అంగీకరిస్తారా ? లేదా ? అన్న విషయమై అభిప్రాయాన్ని వెల్లడించాలని సూచించింది.

మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రద్దుపై 26-28 తేదీల్లో  ఓటింగ్...

న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ రద్దుకు సంబంధించి... వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సమ్మతిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కోరింది. ఈ నెల 26-28 తేదీల మధ్య ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని, ఈ పథకాల రద్దు నిర్ణయానికి అంగీకరిస్తారా ? లేదా ? అన్న విషయమై అభిప్రాయాన్ని వెల్లడించాలని సూచించింది. అనంతరం ఈ పథకాల ఇన్వెస్టర్లతో ఈ నెల 29 న సమావేశం నిర్వహించనుంది. కాగా... ఇన్వెస్టర్లు వ్యక్తం చేసే అభిప్రాయాల పై... ఈ స్కీం పునఃప్రారంభం ఆధారపడి ఉంటుంది. మళ్లీ ప్రారంభించాలా ?  లేదా... డబ్బు తిరగి చెల్లించాలా ? అన్న విషయమై ఓటర్లు అబిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. 


ఆరు మ్యూచువల్ ఫండ్ స్కీంల రద్దుపై యూనిట్ హోల్డర్లతో సమావేశం నిర్వహించేందుకు వారం రోజుల్లో చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ స్కీంకు వేరువేరుగా ఇన్వెస్టర్ల అనుమతిని కంపెనీ కోరింది. నిధుల ఉపసంహరణ ఒత్తిడి, బాండ్ మార్కెట్లో ద్రవ్యలభ్యతలేమి కారణాలను చూపుతూ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఏప్రిల్ 23 న ప్రాంక్లిన్ టెంపుల్టన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-12-11T20:58:28+05:30 IST