‘రెడ్ఎక్స్’ పోస్టుపెయిడ్ ప్లాన్ ధర పెంచేసిన వొడాఫోన్

ABN , First Publish Date - 2020-05-12T03:13:38+05:30 IST

ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన ‘రెడ్ఎక్స్’ పోస్టుపెయిడ్ ప్లాన్ గడువును పెంచేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్

‘రెడ్ఎక్స్’ పోస్టుపెయిడ్ ప్లాన్ ధర పెంచేసిన వొడాఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన ‘రెడ్ఎక్స్’  పోస్టుపెయిడ్ ప్లాన్ గడువును పెంచేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ ధర రూ.999గా ఉండగా, ఇప్పుడు రూ.100 పెంచింది. ఫలితంగా ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 1,099కి పెరిగింది. అయితే, ప్రయోజనాల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ ప్లాన్‌లో అపరిమిత మొబైల్ డేటా, దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, నేషనల్ రోమింగ్, నెలకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా ఏడాదిపాటు నెట్‌ఫిక్స్ యాక్సెస్ లభిస్తుంది.  

Updated Date - 2020-05-12T03:13:38+05:30 IST