ఆన్‌లైన్‌ లావాదేవీలకు కార్డులు వాడలేదా?

ABN , First Publish Date - 2020-03-08T06:47:30+05:30 IST

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? వాటిని దుకాణాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్ల వద్ద బిల్లుల చెల్లింపులకే తప్ప ఎప్పుడూ ఆన్‌లైన్‌ లావాదేవీలకు వినియోగించలేదా?

ఆన్‌లైన్‌ లావాదేవీలకు కార్డులు వాడలేదా?

అయితే మార్చి 16 తర్వాత కష్టమే..


మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? వాటిని దుకాణాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్ల వద్ద బిల్లుల చెల్లింపులకే తప్ప ఎప్పుడూ ఆన్‌లైన్‌ లావాదేవీలకు వినియోగించలేదా? అయితే మీరు ఒక్కసారైనా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఈ కార్డులను వినియోగించుకోండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ కార్డులు పని చేయవు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల భద్రతను పెంచే నిమిత్తం ఈ ఏడాది జనవరి 20న భారత రిజర్వు బ్యాంక్‌ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ లేదా కాంటాక్ట్‌లెస్‌ లెస్‌ లావాదేవీలను నిర్వహించని కార్డులకు ఈ సదుపాయాన్ని నిలిపివేయాలని కార్డుల జారీ సంస్థలను కోరింది. ఈ నేపథ్యంలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్న వారు మార్చి 16 వరకు ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహిస్తే ఈ సదుపాయం కొనసాగుతుంది. లేకపోతే ఆ సదుపాయం నిలిచిపోతుంది. 

Updated Date - 2020-03-08T06:47:30+05:30 IST