భారత్‌తో మినీ ట్రేడ్‌ ఒప్పందమే బెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-26T07:28:26+05:30 IST

భారత-అమెరికా మినీ ట్రేడ్‌ డీల్‌ వచ్చే నెలలో అధికారం చేపట్టనున్న బైడెన్‌ ప్రభుత్వ అగ్రప్రాధాన్యం కావాలని అమెరికా భారత వాణిజ్య మండలి (యూ ఎ్‌సఐబీసీ) సూచించింది...

భారత్‌తో మినీ ట్రేడ్‌ ఒప్పందమే బెస్ట్‌

వాషింగ్టన్‌: భారత-అమెరికా మినీ ట్రేడ్‌ డీల్‌ వచ్చే నెలలో అధికారం చేపట్టనున్న బైడెన్‌ ప్రభుత్వ అగ్రప్రాధాన్యం కావాలని అమెరికా భారత వాణిజ్య మండలి (యూ ఎ్‌సఐబీసీ) సూచించింది. భారత, అమెరికా దేశాల బంధం పటిష్ఠంగా కొనసాగుతున్నదని, 2021లో ఈ బంధం మరింత విస్తరించేందుకు కీలక అవకాశాలు అందుబాటులోకి తెస్తుందని యూఎన్‌ఐబీసీ ప్రెసిడెంట్‌ నిశా దేశాయ్‌ బిస్వాల్‌ అన్నా రు. ఈ ఏడాది ట్రంప్‌ భారత పర్యటనతో ఉభయ దేశాల సంబంధాలు మరింత పటిష్ఠం అయినప్పటికీ యూఎస్‌, ఇండియా మినీ ట్రేడ్‌ డీల్‌ మాత్రం సాకారం కాలేదన్నారు. వాణిజ్య సంబంధాలకు అవరోధాలను తొలగించుకునేందుకు కూడా ఉభయ దేశాలు చిత్తశుద్ధితో ఉన్నట్టు ఆమె చెప్పారు. 


Updated Date - 2020-12-26T07:28:26+05:30 IST