యూనియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు
ABN , First Publish Date - 2020-08-11T06:11:25+05:30 IST
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎంసీఎల్ఆర్ను 0.15 శాతం మేరకు తగ్గించింది. మంగళవారం నుంచే కొత్త రేటు అమలులోకి వస్తుంది...

ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎంసీఎల్ఆర్ను 0.15 శాతం మేరకు తగ్గించింది. మంగళవారం నుంచే కొత్త రేటు అమలులోకి వస్తుంది. దీంతో ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.25 శాతానికి దిగివస్తుంది. 3 నెలల కాలానికి 6.95 శాతం, 6 నెలల కాలానికి 7.10 శాతం అవుతుంది.