తగ్గిన యూబీఐ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు

ABN , First Publish Date - 2020-05-09T05:37:41+05:30 IST

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ).. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేట్లు తగ్గించింది.

తగ్గిన యూబీఐ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు

ముంబై: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ).. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేట్లు తగ్గించింది. రుణాల కాల పరిమితిని బట్టి ఈ తగ్గింపు ఐదు బేసిస్‌ పాయింట్ల నుంచి 15 బేసిస్‌ పాయింట్లు ఉంటుంది. ఈ నెల 11 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్ల ప్రకా రం ఏడాది కాలపరిమితి గల రుణంపై వడ్డీ రేటు 7.75ు నుంచి 7.70 శాతానికి, ఓవర్‌నైట్‌ కాలపరిమితి ఉండే రుణాలపై వడ్డీ 7.30 శాతం నుంచి 7.15 శాతానికి, నెల రోజుల కాలపరిమితి రుణాలపై వడ్డీ 7.35 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది. 

Updated Date - 2020-05-09T05:37:41+05:30 IST