‘ఉబెర్’ ఎక్కాలంటే మాస్కు తప్పనిసరి!

ABN , First Publish Date - 2020-05-19T00:31:34+05:30 IST

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రైడ్ హెయిలింగ్ యాప్ ఉబెర్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో ఇకపై

‘ఉబెర్’ ఎక్కాలంటే మాస్కు తప్పనిసరి!

న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రైడ్ హెయిలింగ్ యాప్ ఉబెర్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో ఇకపై ప్రయాణాల సందర్భంగా ప్రయాణికుడు, డ్రైవర్‌కు మాస్క్ తప్పనిసరని పేర్కొంది. దేశంలో నేటి నుంచి నాలుగో విడత లాక్‌డౌన్ ప్రారంభం కాగా, కంటైన్‌మెంట్, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం వదిలేసింది. రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉబెర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫాంలు వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించనున్నాయి.

  

ఇండియా సహా ఇతర దేశాల ఉబెర్ డ్రైవర్లు అందరూ నేటి నుంచి పేస్‌మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఉబెర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ కన్సాల్ తెలిపారు. ఫేస్ మాస్క్ ధరించి డ్రైవర్లు సెల్ఫీ పంపాలని, ఉబెర్‌లోని కొత్త సాంకేతికత డ్రైవర్లను గుర్తిస్తుందని కన్సాల్ పేర్కొన్నారు. అలాగే, ప్రతీ ట్రిప్‌లోనూ రైడర్లకు కూడా చెక్‌లిస్ట్ ఉంటుందన్నారు. ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫేస్‌మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని అన్నారు. డ్రైవర్ కానీ, ప్రయాణికుడు కానీ ఎవరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ విషయాన్ని కంపెనీకి తెలిపి ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని అన్నారు.   


Updated Date - 2020-05-19T00:31:34+05:30 IST