సైయెంట్‌కు ప్రాట్‌ అండ్‌ విట్నీ అవార్డులు

ABN , First Publish Date - 2020-03-12T06:55:42+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ 2019 ఏడాదికి రెండు ప్రాట్‌ అండ్‌ విట్నీ సప్లయర్‌ అవార్డులు...

సైయెంట్‌కు ప్రాట్‌ అండ్‌ విట్నీ అవార్డులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ 2019 ఏడాదికి రెండు ప్రాట్‌ అండ్‌ విట్నీ సప్లయర్‌ అవార్డులు పొందింది. వరుసగా ఏడో సంవత్సరం సప్లయర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు, వరుసగా నాలుగో ఏడాది అత్యధిక సప్లయర్‌ అవార్డు లభించాయని సైయెంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఏరోస్పేస్‌, డిఫెన్స్‌) ఆనంద్‌ పరమేశ్వరన్‌ తెలిపారు. ఇన్నోవేటివ్‌ ఇంజినీరింగ్‌ సొల్యూషన్ల ద్వారా 2019లో ప్రాట్‌ అండ్‌ విట్నీకి సైయెంట్‌ విలువను చేకూర్చిందని, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచిందని అన్నారు. 

Updated Date - 2020-03-12T06:55:42+05:30 IST