వాల్‌స్ట్రీట్‌లో ట్రంప్రకంపనలు

ABN , First Publish Date - 2020-10-03T07:09:26+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా సోకడంతో వాల్‌స్ట్రీట్‌ జడుసుకుంది. శుక్రవారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికన్‌ స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయాయి...

వాల్‌స్ట్రీట్‌లో ట్రంప్రకంపనలు

అమెరికన్‌ స్టాక్‌ సూచీలు ఢమాల్‌.. 40 డాలర్ల దిగువకు క్రూడ్‌ 


న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా సోకడంతో వాల్‌స్ట్రీట్‌ జడుసుకుంది. శుక్రవారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికన్‌ స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. డోజోన్స్‌ సూచీ ఒక దశలో 400 పాయింట్లకు పైగా పతనమైంది. నాస్‌డాక్‌ సూచీ 2 శాతం పైగా క్షీణించింది. అయితే, ఉద్దీపనలపై పెరిగిన అంచనాలు మార్కెట్లో నష్టాల తీవ్రతను తగ్గించగలిగాయి. తదుపరి ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అమెరికా ప్రభుత్వం విమాన రంగానికీ సాయం ప్రకటించవచ్చన్న సంకేతాలు సూచీల రికవరీకి దోహదపడ్డాయి. ఈక్విటీలతో పాటు ముడి చమురు ధరలూ క్షీణించాయి. బ్రెంట్‌ రకం క్రూడ్‌ ధర ఒక దశలో 3.88 శాతం తగ్గి 39.34 డాలర్ల వద్ద ట్రేడైంది. 

Updated Date - 2020-10-03T07:09:26+05:30 IST