టిక్ టాక్ విక్రయానికి డిసెంబర్ 4 వరకు గడువు పొడిగింపు...

ABN , First Publish Date - 2020-11-26T21:47:17+05:30 IST

చైనీస్ యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారమిచ్చింది.

టిక్ టాక్ విక్రయానికి డిసెంబర్ 4 వరకు గడువు పొడిగింపు...

బీజింగ్ : చైనీస్ యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో... డిసెంబరు 4 లోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికినట్లైంది. టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... గడువును పలుమార్లు పొడిగించారు. తాజా గడువు 27 వ తేదీతో ముగిసిన నేపధ్యంలో... దానిని మరో వారం రోజులు పెంచింది.


తొలుత ఆగస్ట్ ప్రారంభంలో 45 రోజుల గడువిచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబర్ 12 వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత...మరో 15 రోజులు పొడిగించి, నవంబరు 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.


Updated Date - 2020-11-26T21:47:17+05:30 IST