ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు... జనవరి 31 వరకు అవకాశం...

ABN , First Publish Date - 2020-12-03T20:44:33+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం... ఇందులో భాగంగా 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31 వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దీనీని మరోమారు పొడిగించారు.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు... జనవరి 31 వరకు అవకాశం...

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం... ఇందులో భాగంగా 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31 వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా దీనీని మరోమారు పొడిగించారు. 


 కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ)... ఈ గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖట్విట్టర్ లో వెల్లడించింది. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీ గడువును  వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని ఆర్థికమంత్రిత్వశాఖ పొడిగించడం ఇది రెండోసారి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారి నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మే నెలలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పొడిగించారు.


Updated Date - 2020-12-03T20:44:33+05:30 IST