మహిళా ఔత్సాహికులకు ‘టై విమెన్‌’ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-03-17T07:14:42+05:30 IST

మహిళా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై).. ‘టై విమెన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో...

మహిళా ఔత్సాహికులకు ‘టై విమెన్‌’ కార్యక్రమం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహిళా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై).. ‘టై విమెన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెబ్‌కాస్ట్‌ ద్వారా టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి దీన్ని ప్రకటించారు. ఇందులో వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న స్టార్ట్‌పలలో కొన్నింటిని చాప్టర్‌ స్థాయిలో ఎంపిక చేసి మద్దతు కార్యక్రమాలను నిర్వహిస్తారు. జూన్‌ 12న వీటికి పోటీ నిర్వహిస్తారు. చివర్లో చాప్టర్‌ విన్నర్‌తో పాటు 3 రన్నర్‌ స్టార్ట్‌పలను ఎంపిక చేస్తారు. విజేతకు భారత్‌లో ఉచితంగా బూట్‌ క్యాప్‌నకు హాజరయ్యే అవకాశం లభించడంతోపాటు దుబాయ్‌లో డిసెంబరులో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌లో పాలుపుంచుకునే అవకాశం లభిస్తుంది. అక్కడ లక్ష డాలర్ల ఈక్విటీ ఫ్రీ ఫండ్‌ గెలుచుకునే వీలు కూడా ఉంటుందని టై హైదరాబాద్‌ తెలిపింది.

Read more