బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్‌ జీవితకాల సాఫల్య అవార్డు

ABN , First Publish Date - 2020-12-11T07:58:38+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్‌ (ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) జీవితకాల సాఫల్య అవార్డును ప్రకటించింది.

బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్‌ జీవితకాల సాఫల్య అవార్డు

ఎఫ్‌సీ కోహ్లీకి కూడా 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు టై గ్లోబల్‌ (ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌) జీవితకాల సాఫల్య అవార్డును ప్రకటించింది. టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌ వ్యవస్థ, ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. వర్చువల్‌గా బిల్‌గేట్స్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి ఆఽధ్వర్యంలోని బృందం జీవితకాల సాఫల్య అవార్డుకు బిల్‌గేట్స్‌ను ఎంపిక చేసింది. టెక్నాలజీ ఇన్నోవేషన్‌, వ్యాపార, పోటీ వ్యూహాలతో బిల్‌గేట్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని సంస్థను సృష్టించారు. బిల్‌గేట్స్‌ లివింగ్‌ లెజెండ్‌ అని టై గ్లోబల్‌ సదస్సు-2020 చైర్మన్‌ శ్రీధర్‌ అన్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌, ప్రకృతి వైపరిత్యాల వంటి క్లిష్ట సవాళ్లను అధిగమించడానికి ఇన్నోవేషన్‌ కీలకమన్నారు. ‘మైక్రోసా్‌ఫ్టను ప్రారంభించేటప్పుడు నేను, నా భాగస్వామి దీన్నే విశ్వసించాం. ఇన్నోవేషన్‌, క్రియేటివిటీ మాత్రమే మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలవు. ప్రపంచవ్యాప్తంగా  టై ఇదే చేస్తోంది. ఇన్నోవేటర్లకు మద్దతు ఇస్తోంద’ని అన్నారు.

 

12 విభాగాల్లో అవార్డులు: భారత ఐటీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ఎఫ్‌సీ కోహ్లీకి జీవితకాల సాఫల్య అవార్డు టై గ్లోబల్‌ ప్రదానం చేసింది. ఉత్తమ ప్రభు త్వ ఏజెన్సీ, ప్రపంచ ఉత్తమ యాక్సిలరేటర్‌, అత్యంత క్రియాశీల ఏంజెల్‌ నెట్‌వర్క్‌, ఉత్తమ ప్రపంచ వీసీ ఫండ్‌ వంటి 12 విభాగాల్లో కూడా టై ఈ అవార్డులు అందించింది.

Updated Date - 2020-12-11T07:58:38+05:30 IST