అంచనాకు మించి కోలుకుంటున్నా కూడా... శక్తికాంతదాస్

ABN , First Publish Date - 2020-11-26T23:10:40+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

అంచనాకు మించి కోలుకుంటున్నా కూడా... శక్తికాంతదాస్

మేంబై : భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే అదే సమయంలో... పండుగ సీజన్ ముగియడంతో డిమాండ్ సుస్థిరతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా వేగవంతం కావడంతో వృద్ధి అంచనాలు పెరుగుతున్నాయని, కానీ కరోనా కేసులు వృద్ధికి నష్టాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించారు. కాగా... భారత ఆర్థిక కార్యకలాపాలు, వ్యవస్థ మాత్రం ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ అవుతున్నాయన్నారు. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ సుస్థిరతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. 


ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఈడీఏఐ) నానలుగవ వార్షికోత్సవంలో శక్తికాంతదాస్ మాట్లాడారు. కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంమొదటి త్రైమాసికంలో వృద్ధి ‘మైనస్ 23.9’ శాతాన్ని నమోదు చేసిన తర్వాత రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయని చెప్పారు. ఇటీవల పలు దేశాలతోపాటు  భారత్ లోని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. పండుగ సీజన్ తర్వాత కొనుగోలు శక్తి స్థిరత్వం పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు టీకా చుట్టూ ఉన్న మార్కెట్ అంచనాలను తిరిగి అంచనా వేయాల్సి ఉందన్నారు. 


ప్రపంచ దేశాల మాదిరిగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణతను ఎదుర్కొంటోందని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేయగా, 2021 ఆర్థిక సంవత్సరానికి ఇది మైనస్ 9.5 శాతానికి తగ్గనున్నట్లు అంచనా వేశామన్నారు. అయితే లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో పాటు పండుగల సీజన్‌లో కోలుకోవడాన్ని చూస్తున్నామని, రెండో త్రైమాసికంలో సాధారణంగానే కనిపించిందని, అంచనా వేసిన దాని కంటే ప్రస్తుతం మరింత పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు.


క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి...

గత మూడు దశాబ్దాలుగా క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచానికి అనుసంధానించబడిన వ్యవస్థగా భారత్ ఎదిగిందని శక్తికాంతదాస్ వెల్లడించారు. అంతర్జాతీయ లావాదేవీలు, మూలధన ప్రవాహాలు అంతకుముందు కంటే  పెరిగాయన్నారు. భారత్‌లో చాలా రంగాల్లో ఈ రోజు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నట్లు వెల్లడించారు. అలాగే విలీన సంస్థల ద్వారా నికర విలువ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం వృద్ధి కొనసాగుతున్న సమయంలో యూరోప్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విజృంభించడం రికవరీపై ప్రభావం చూపే ప్రమాదముందని శక్తికాంతదాస్ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-26T23:10:40+05:30 IST