థామ్సన్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు

ABN , First Publish Date - 2020-08-01T08:19:13+05:30 IST

పూర్తిగా భారత్‌లో రూపొందించి, తయారు చేసిన ఆండ్రాయిడ్‌ టీవీలను థామ్సన్‌ విడుదల చేసింది.

థామ్సన్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పూర్తిగా భారత్‌లో రూపొందించి, తయారు చేసిన ఆండ్రాయిడ్‌ టీవీలను థామ్సన్‌ విడుదల చేసింది. 75 అంగుళాల లగ్జరీ టెలివిజన్‌ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది గూగుల్‌తో కలిసి ఈ  ఆండ్రాయిడ్‌ టీవీలను తయారు చేసినట్లు భారత్‌లో థామ్స న్‌ టీవీల తయారీకి లైసెన్స్‌ పొందిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ తెలిపింది. పాథ్‌ 9ఏ, 9ఆర్‌, ఓత్‌ ప్రో శ్రేణిలో కొత్త టీవీలను విడుదల చేసింది. వీటి ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. 75 అంగుళాల టీవీ ధర రూ.99,999. ఈ టీవీలు ఆగస్టు 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. 


Updated Date - 2020-08-01T08:19:13+05:30 IST