ఈ ఎలక్ట్రిక్ ఈసైకిల్ ‌ఖరీదు రూ. 49 వేలు...

ABN , First Publish Date - 2020-12-27T21:34:54+05:30 IST

హీరో సైకిల్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. ఎఫ్6ఐ పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్‌ ఖరీదు రూ. 49 వేలు. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది.

ఈ ఎలక్ట్రిక్ ఈసైకిల్ ‌ఖరీదు రూ.  49 వేలు...

న్యూఢిల్లీ  : హీరో సైకిల్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. ఎఫ్6ఐ పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్‌ ఖరీదు రూ. 49 వేలు. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది.


ఎఫ్6ఐ సైకిల్‌ రెడ్‌ విత్‌ బ్లాక్‌, యెల్లో విత్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఎఫ్6ఐ సైకిల్‌ వెనుక హబ్‌కు 36వీ/250డబ్ల్యూ సామర్థ్యంగల మోటారును అమర్చారు. ఇందుకణుగుణంగా 36వీ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీను ర్పాటు చేశారు. విడదీసేందుకు వీలైన ఈ బ్యాటరీని 5-6 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. సైకిల్‌కు అమర్చిన 7 స్పీడ్‌ షిమానో ఆల్టస్ సహాయంతో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని తెలియజేసింది.


అలాయ్‌ ఫ్రేమ్‌...

అలాయ్‌ ఫ్రేమ్‌తో రూపొందిన ఎఫ్6ఐ ఎలక్ట్రిక్‌ సైకిల్‌కు ముందు భాగంలో 60బఎంఎం ఫోర్క్‌లు, వెనుక డ్యూయల్‌ డిస్క్‌ బ్రేకులను అమర్చారు. ముందు, వెనుక భాగంలో లైట్లు, లెడ్‌ డిస్‌ప్లేలతో సైకిల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్‌బీ చార్జింగ్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ లాకింగ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ సౌకర్యాలను సైతం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


వృద్ధి బాటలో ఉన్న ఎలక్ట్రిక్‌ సైకిళ్ల విభాగంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్6ఐ కీలక మోడల్‌ అని హీరో లెక్ట్రో సీఈవో అదిత్య ముంజాల్‌ పేర్కొన్నారు. దేశీయంగా ప్రీమియం సైకిళ్లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఈ సైకిల్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా హైఎండ్‌ బైకింగ్‌ విభాగంలో భారీ డిమాండు నెలకొన్నదని, సరైన సమయంలో ఆధునిక సాంకేతికలతో కూడిన సైకిల్‌ను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Read more