డ్రోన్లకు థర్డ్‌పార్టీ బీమా కవరేజీ!
ABN , First Publish Date - 2020-06-16T06:06:51+05:30 IST
వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్ల యజమానులు, ఆపరేటర్లకు థర్డ్‌పార్టీ బీమా కవరేజీ సదుపాయం కల్పించేందుకు హెచ్‌డీఎ్‌ఫసీ ఎర్గో ముందుకొచ్చింది. బీమా రంగంలో డ్రోన్ల కోసం ప్రవేశపెట్టిన తొలి ఇన్సూరెన్స్ పాలసీ

ముంబై: వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్ల యజమానులు, ఆపరేటర్లకు థర్డ్‌పార్టీ బీమా కవరేజీ సదుపాయం కల్పించేందుకు హెచ్‌డీఎ్‌ఫసీ ఎర్గో ముందుకొచ్చింది. బీమా రంగంలో డ్రోన్ల కోసం ప్రవేశపెట్టిన తొలి ఇన్సూరెన్స్ పాలసీ ఇదని సంస్థ అంటోంది. ఇందుకోసం ట్రోపొగో అనే టెక్నాలజీ కంపెనీతో జట్టుకట్టినట్లు ఈ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. డ్రోన్లను ఎగిరించే ప్రక్రియలో ఏదేని ఆస్తి నష్టం లేదా ఎవరికైనా గాయాలు తగిలిన పక్షంలో బీమా కవరేజీ లభిస్తుంది. ‘పే యాజ్ యూ ఫ్లై’ (డ్రోన్ల వినియోగం ఆధారంగా ప్రీమియం చెల్లించడం) విధానంలో ఈ బీమా పాలసీని ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలో డ్రోన్ల నిర్వహణకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పనిసరి.