భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం
ABN , First Publish Date - 2020-12-11T08:20:07+05:30 IST
భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతోందని సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కె ప్రసాద్ తెలిపారు.
భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం
గుంటూరు (ఆంధ్రజ్యోతి): భారత్‌లో ఏటా రూ.35 వేల కోట్ల విత్తన వ్యాపారం జరుగుతోందని సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కె .ప్రసాద్ తెలిపారు. గురువారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 65 శాతం విత్తనాల ఉత్పత్తి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న విత్తనాల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 85-90 శాతం ఉందన్నారు. జాతీయస్థాయిలో ఏటా హైబ్రిడ్ వరి, మొక్కజొన్న విత్తనాల వ్యాపారం ఇక్కడ రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. మన దేశంలో విత్తనోత్పత్తి, వ్యాపారానికి హైదరాబాద్ రాజధానిగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏటా రూ.1,000 కోట్ల జూట్ విత్తనోత్పత్తి, వ్యాపారానికి గుంటూరు కేంద్రంగా ఉందన్నారు. అధిక లాభాల కోసం ఈ రంగంలోకి వచ్చిన కొంతమంది వ్యాపారుల వల్లే కల్తీ, నకిలీల సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ఏపీలో మొక్కజొన్న విత్తన పరిశోధనలు పెంచుతున్నట్లు తెలిపారు.