భవిష్యత్‌ బేఫికర్‌!

ABN , First Publish Date - 2020-04-21T08:17:36+05:30 IST

భవిష్యత్‌ బేఫికర్‌!

భవిష్యత్‌ బేఫికర్‌!

ప్రస్తుత అవస్థలు స్వల్పకాలమే.. 

భారత వృత్తినిపుణుల మనోగతంపై లింక్డిన్‌ సర్వే 


న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలోనూ భారత వృత్తి నిపుణులు భవిష్యత్‌పై ధీమాగా ఉన్నారని లింక్డిన్‌ తాజా సర్వే నివేదిక తెలిపింది. స్వల్పకాలికంగా ఉద్యోగావకాశాలు, కంపెనీల ఆర్థిక పరిస్థితులపైన మాత్రం అధిక ఆందోళన వ్యక్తం చేసినట్లు రిపోర్టు పేర్కొంది. ఈ నెల తొలి వారానికి (1 నుంచి 7 వరకు) భారత్‌కు సంబంధించి ‘లింక్డిన్‌ వర్క్‌ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌’ స్కోర్‌ 53గా నమోదైంది.


ఈ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 

దాదాపు 50% : వచ్చే 6 నెలల్లో మళ్లీ ఆర్థికంగా మెరుగుపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. 

ఐదుగురిలో ముగ్గురు : వచ్చే ఏడాది కాలంలో వృత్తిపరంగా పురోగతిపై నమ్మకంగా ఉన్నవారు.

72% : వచ్చే రెండేళ్లలో తమ కంపెనీ మళ్లీ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసినవారు. 

42% : వచ్చే రెండు వారాల్లో ఉద్యోగాన్వేషణ కోసం అధిక సమయం వెచ్చించాలనుకుంటున్నవారు. 

64%: వచ్చే రెండు వారాలు విజ్ఞాన సముపార్జనపై దృష్టిపెంచాలనుకుంటున్నవారు. 


సీనియర్‌ మేనేమెంజ్‌  అభిమతమిది..

33%- వచ్చే 6 నెలలు  గడ్డుకాలమే.. 

69%- వచ్చే రెండేళ్లలో వృద్ధిపై ధీమా 


కోవిడ్‌ కష్టాలపై  

ఆదాయం తగ్గింది    25%

పొదుపు తగ్గింది 39%

వ్యక్తిగత ఖర్చు తగ్గింది 42%

పెట్టుబడులు తగ్గాయి 31%

Updated Date - 2020-04-21T08:17:36+05:30 IST