తొలి క్రిప్టో కరెన్సీ బ్యాంక్‌

ABN , First Publish Date - 2020-12-29T06:18:25+05:30 IST

క్రిపో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపేందుకు తొలి క్రిప్టో బ్యాంక్‌ ప్రారంభమైంది. ఫిన్‌టెక్‌ కంపెనీ క్యాషా, యునైటెడ్‌ మల్టీస్టేట్‌ కో-

తొలి క్రిప్టో కరెన్సీ బ్యాంక్‌

న్యూఢిల్లీ: క్రిపో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపేందుకు   తొలి క్రిప్టో బ్యాంక్‌ ప్రారంభమైంది. ఫిన్‌టెక్‌ కంపెనీ క్యాషా, యునైటెడ్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సంయుక్తంగా ఈ బ్యాంక్‌ను ప్రారంభించాయి. యునికాస్‌ పేరుతో ప్రారంభమైన ఈ బ్యాంక్‌ తొలుత ఆన్‌లైన్‌లో సేవలందించనుంది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్‌సీఆర్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ సహా 14 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.


2022 చివరి నాటికి బ్రాంచీల సంఖ్యను 100కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ బ్యాంక్‌లాగే ఈ క్రిప్టో బ్యాం క్‌లో సేవింగ్స్‌ ఖాతా ద్వారా కస్టమర్లు క్రిప్టో కరెన్సీతో పాటు సంప్రదాయ కరెన్సీ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే, సంప్రదాయ కరెన్సీ లావాదేవీల నిర్వహణకు ఈ బ్యాంక్‌కు ఆర్‌బీఐ అనుమతి ఉందా..? అన్న విషయంపైన మాత్రం స్పష్టత లేదు. 


Updated Date - 2020-12-29T06:18:25+05:30 IST