స్వల్ప లాభాల్లో మార్కెట్లు

ABN , First Publish Date - 2020-03-24T17:57:56+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చిన దరిమిలా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఫలితంగా సోమవారం నాటి భారీపతనం నుంచి...

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చిన దరిమిలా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఫలితంగా సోమవారం నాటి భారీపతనం నుంచి కోలుకున్నట్లయ్యింది. ఈ రోజు సెన్సెక్స్ 1286 పాయింట్ల మేరకు ఎగిసి 27314 వద్ద, నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో 8003 పాయింట్ల దగ్గర కొనసాగుతున్నాయి. నిఫ్టీ  8 వేల మార్కును దాటింది. ప్రస్తుతం సుమారు అన్ని రంగాల షేర్లు లాభాలలో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఈ రంగానికి సంబంధించిన షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ రంగాలు లాభపడుతున్నాయి. కాగా షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్  రీబౌండ్ అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి స్థితిలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించి అడుగు వేయాలని సూచిస్తున్నారు.

Read more