జూన్ నాటికి భారత్‌లోకి టెస్లా కార్లు
ABN , First Publish Date - 2020-12-27T09:42:08+05:30 IST
భారత మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు త్వరలో అడుగుపెట్టనున్నాయి. 2021 జనవరి నుంచి మోడల్ 3 సెడాన్ కార్లకు బుకింగ్స్ ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ సారథ్యంలోని

జనవరి నుంచి బుకింగ్స్ షురూ
తొలుత మోడల్ 3 సెడాన్ విడుదల
భారత మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు త్వరలో అడుగుపెట్టనున్నాయి. 2021 జనవరి నుంచి మోడల్ 3 సెడాన్ కార్లకు బుకింగ్స్ ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సిద్ధమవుతోంది. అంతేకాదు.. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి ఈ కార్లను డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లో తొలిసారిగా విడుదల చేయనున్న ఈ కారు ధరలు రూ.55-60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లోకి టెస్లా కార్లు అడుగుపెట్టనున్నాయని సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది అక్టోబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2017లో టెస్లా విడుదల చేసిన మోడల్ 3 సెడాన్ కారు.. ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా భారత్‌లోకి దిగుమతి కానున్న ఈ కారు కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయి చార్జింగ్ అవుతుంది.