15,000 ఉద్యోగాలు.. రూ.1,800 కోట్లు నిధులు

ABN , First Publish Date - 2020-11-06T06:20:49+05:30 IST

టీ-హబ్‌ ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్లలో టీ-హబ్‌ స్టార్ట్‌పలు 15,000 పైగా ఉద్యోగాలను కల్పించాయి. రూ.1,800 కోట్ల నిధులను సమీకరించాయని టీ-హబ్‌ సీఈఓ రవి నారాయణ్‌ తెలిపారు...

15,000 ఉద్యోగాలు..  రూ.1,800 కోట్లు నిధులు

  • ఐదేళ్లలో టీ-హబ్‌ ప్రగతి
  • 75కు పైగా ఇన్నోవేషన్‌ ప్రొగ్రామ్‌లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స):టీ-హబ్‌ ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్లలో టీ-హబ్‌ స్టార్ట్‌పలు 15,000 పైగా ఉద్యోగాలను కల్పించాయి. రూ.1,800 కోట్ల నిధులను సమీకరించాయని టీ-హబ్‌ సీఈఓ రవి నారాయణ్‌ తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా దేశీయ ఇన్నోవేషన్‌ వ్యవస్థలో టీ-హబ్‌ కీలక పాత్ర పోషించింది. స్టార్ట్‌పలు, కంపెనీలకు ప్రత్యేక ఇన్నోవేషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ కాలంలో టీ-హబ్‌ 75కు పైగా ఇన్నోవేషన్‌ ప్రొగ్రామ్‌లను చేపట్టిందని రవి నారాయణ్‌ అన్నారు. స్టార్ట్‌పలు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఖాతాదారులను పొందడానికి, నిధులు సమీకరించడానికి ఇవి దోహదపడ్డాయి. 2015 నుంచి 1100 స్టార్ట్‌పలు, 430పైగా కంపెనీలపై టీ-హబ్‌ ప్రభావం చూపిందన్నారు. 325 పైగా అంతర్జాతీయ స్టార్టప్‌ కనెక్షన్లను ఏర్పాటు చేసుకోగలిగింది.

గత ఏడాది కాలంలో: గత ఏడాది కాలంలో దక్షిణ కొరియా ప్రభుత్వం, జపాన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ కో ఆపరేటివ్‌ ఏజెన్సీ (జేఐసీఏ) వంటి అంతర్జాతీయ సంస్థలతో టీ-హబ్‌ చేతులు కలిపింది. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, నల్సర్‌, టై, సీఐఐ, నాస్కామ్‌, హైసియా స్టార్టప్‌ ఇండియా వంటి వాటితో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. టీ-హబ్‌ కార్పొరేట్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌..బోయింగ్‌, ఓప్పో తదితర కంపెనీలు టీ-హబ్‌లో కార్యకలాపాలను ప్రారంభించే విధంగా చేసింది. కాగా, కేవలం కొన్నేళ్లలోనే రాష్ట్రంలో స్టార్ట్‌పల సంఖ్య 400 నుంచి 2,000కు పెరిగింది. 


Updated Date - 2020-11-06T06:20:49+05:30 IST