షేర్‌ ట్రేడింగ్‌ హబ్‌గా తెలంగాణ!

ABN , First Publish Date - 2020-10-13T07:28:20+05:30 IST

దేశంలోని స్టాక్‌ ట్రేడింగ్‌ హబ్‌ల్లో ఒకటిగా తెలంగాణ ఎదుగుతోంది. బీఎ్‌సఈ డేటా ప్రకారం.. గడిచిన ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని రిజిస్టర్డ్‌ ఈక్విటీ మదుపర్లు 152 శాతం వృద్ధి చెంది 13,83,221కి చేరారు. మణిపూర్‌ (183 శాతం), అరుణాచల్‌ ప్రదేశ్‌ (90 శాతం), మిజోరాం (86 శాతం) వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈక్విటీ ట్రేడర్లు గణనీయంగా పెరిగారు...

షేర్‌ ట్రేడింగ్‌ హబ్‌గా తెలంగాణ!

  • గడిచిన ఏడాదికాలంలో 152 శాతం పెరిగిన ట్రేడర్లు 
  • ఈశాన్యంలోనూ ఈక్విటీ మదుపరుల గణనీయ వృద్ధి

కొత్త ఈక్విటీ ఇన్వెస్టర్లు మార్కెట్‌ వాల్యుయేషన్‌ను సరికొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. ఇప్పటివరకూ గుజరాత్‌, మహారాష్ట్రలోనే షేర్‌ ట్రేడింగ్‌ అధికంగా జరిగేది. ఇతర రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా ఈశాన్య భారతంలోనూ రిజిస్టర్డ్‌ ట్రేడర్లు పెరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.  

- జీ చొక్కలింగం, ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు 



ముంబై: దేశంలోని స్టాక్‌ ట్రేడింగ్‌ హబ్‌ల్లో ఒకటిగా తెలంగాణ ఎదుగుతోంది. బీఎ్‌సఈ డేటా ప్రకారం.. గడిచిన ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని రిజిస్టర్డ్‌ ఈక్విటీ మదుపర్లు 152 శాతం వృద్ధి చెంది 13,83,221కి చేరారు. మణిపూర్‌ (183 శాతం), అరుణాచల్‌ ప్రదేశ్‌ (90 శాతం), మిజోరాం (86 శాతం) వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈక్విటీ ట్రేడర్లు గణనీయంగా పెరిగారు. లక్షద్వీ్‌పలో సైతం 73 శాతం వృద్ధి నమోదైంది. స్టాక్‌ ట్రేడర్లు అత్యధికంగా ఉండే గుజరాత్‌, మహారాష్ట్రల్లోనూ వీరి సంఖ్య మరింత పెరిగింది. గుజరాత్‌లో 25 శాతం, మహారాష్ట్రలో 35 శాతం వృద్ధి నమోదైంది. దేశంలోని ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈ. ఈ రెండూ కూడా దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే ఉన్నాయి. దలాల్‌ స్ట్రీట్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పాత్ర గణనీయంగా పెరిగిందని, ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీలో వారూ కీలకపాత్ర పోషిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. 



మరిన్ని విషయాలు.. 

  1. ఆగస్టుతో ముగిసిన మూడు నెలల్లో దేశంలో కొత్తగా 10 లక్షల చొప్పున డీమ్యాట్‌ అకౌంట్లు తెరిచారు. 
  2. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్‌ అకౌంట్లు ఓపెన్‌ అయ్యాయి. ఏదేని ఏడాదిలో తెరిచిన ఖాతాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 
  3. 2020 అక్టోబరు 12 నాటికి దేశంలో రిజిస్టర్డ్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు 5.5 కోట్ల పైమాటే. వార్షిక  ప్రాతిపదికన వీరి సంఖ్య 37 శాతానికి పైగా వృద్ధి చెందింది. 

Updated Date - 2020-10-13T07:28:20+05:30 IST