హైదరాబాద్‌లో టెక్నో పెయుంట్స్‌ కొత్త యూనిట్‌

ABN , First Publish Date - 2020-02-08T07:29:32+05:30 IST

హైదరాబాద్‌తో పా టు తెలుగు రాష్ట్రాల్లో ఐదు తయారీ యూనిట్లు కలిగిన టెక్నో పెయింట్స్‌ విస్తరణలో..

హైదరాబాద్‌లో టెక్నో పెయుంట్స్‌ కొత్త యూనిట్‌

  • రూ.25 కోట్ల పెట్టుబడి 
  • మార్కెట్లోకి కొత్త శ్రేణి రంగులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌తో పా టు తెలుగు రాష్ట్రాల్లో ఐదు తయారీ యూనిట్లు కలిగిన టెక్నో పెయింట్స్‌ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో మ రో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 42 వేల టన్నుల పెయింట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. 40 వేల టన్నులతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని టెక్నో పెయింట్స్‌ బ్రాండ్‌తో పెయింట్లను ఉత్పత్తి చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రూ.25 కోట్లతో 3 ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య, నివాస, పారిశ్రామిక విభాగాల్లో కొత్త శ్రేణి రంగులను కంపెనీ ప్రవేశపెట్టింది. యాంటీ బ్యాక్టీరియల్‌, ఐఆర్‌ రిఫ్లెక్షన్‌ సహా వాటర్‌ బేస్డ్‌ ఎమల్షన్స్‌ను 1,800 కొత్త రంగుల్లో విడుదల చేసింది. నేచురల్‌ స్టోన్‌ స్ట్రక్చర్‌ వంటి స్పెషాలిటీ రంగులను త్వరలో కంపెనీ ప్రవేశపెట్టనుంది. 2019-20 ఏడాదికి అమ్మకాలు రూ.85-90 కోట్లకు, 2022-23 నాటికి టర్నోవర్‌ రూ.250 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు. విదేశీ విస్తరణలో భాగంగా దక్షిణాఫ్రికాలోని స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-02-08T07:29:32+05:30 IST